కేటీఆర్ వస్తడా..?.. హారీష్ రావు వస్తడా..?
మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను.
ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి మా హన్మంతన్నను పంపుతాను. బిల్లా రంగా వచ్చి దాని ముందు పడుకోవాలి. అన్ని లంగా నాటకాలు.. దొంగ మాటలు .. జన్వాడ కేటీఆర్ వస్తడా..?. అజీజ్ నగర్ హారీష్ రావు వస్తడా..?. ఫామ్ హౌజ్ లపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.