ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా
మాట వరుసకైన తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ..సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎంత బుజ్జగించిన సరే ఆంగీకరించే పరిస్థితుల్లో నేను లేనని వాళ్లకు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి..
అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను.. అందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను.. బుధవారం మండలి మీడియా ప్రాంగాణంలో అన్ని విషయాలను మీడియాతో మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలిపినట్లు తెలుస్తుంది.
ఫిరాయింపుల పై నా అభిప్రాయం..రాహుల్ గాంధీ అభిప్రాయం ఒకటే.. దాదాపు నలబై ఏండ్లుగా అధికారంలో ఉన్న లేకపోయిన కాంగ్రెస్ జెండాను భుజాన మోస్తూ ఉన్నాను..ఇవాళ వేరే పార్టీ నాయకులను ఎలా చేర్చుకుంటారు.. పార్టీకి రాజీనామా చేస్తానంటే సీనియర్ నేతలు భట్టీ,శ్రీధర్ బాబు వద్దని వారించారు అని ఆయన మీడియా ముందు తెలిపారు..