కేసీఆర్ కలను రేవంత్ రెడ్డి నిజం చేస్తాడా..?
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో తొలి ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన హామీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో పోటిపడేలా చర్యలు తీసుకుంటామని . ఆ హామీని నెరవేరిచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవరెస్ట్ అంత ఎత్తున నిలబెడదామనుకునే సమయానికి తెలంగాణ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు.
తాజాగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ .. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ నటులు..నిర్మాతదర్శకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ భేటీలో ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున కొన్ని డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందట ఉంచారు. అందులో ఒకటి శంషాబాద్ కు దాదాపు ఇరవై నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో పదిహేను నుండి రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని కోరారు.
రెండు బ్లాక్ టికెట్ దందాను అరికట్టడానికి రాష్ట్రమంతటా ఆన్ లైన్ లో బుకింగ్ సిస్టమ్.. ఫైరసీను అదుపు చేయడం లాంటి డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందట ఉంచారు. మరి గతంలో రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇచ్చిన హామీని మరి ఇప్పుడు రేవంత్ సర్కారు నిజం చేస్తుందో లేదో చూడాలి.