తెలంగాణ గడ్డపై టీడీపీ కి పూర్వ వైభవం వస్తుందా…?
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గత ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తెలంగాణ ప్రాంత టీడీపీ కి చెందిన నాయకులు… కార్యకర్తలు.. అభిమానుల పాత్ర మరువలేనిది.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను.. ఈ గడ్డపై పుట్టిన పార్టీ.. తెలుగు రాష్ట్రాలున్నంత కాలం ఉంటుంది.. నాకు ఏపీ తెలంగాణ రెండు కండ్లు ” అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే…
మరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా..?.. ఇక్కడ ప్రజలు ఆ పార్టీని మళ్ళీ ఆదరిస్తారా..?.. నిజంగానే బాబు అన్న వ్యాఖ్యలు నిజమవుతాయా..? ఒక లుక్ వేద్దాం..?.
తెలంగాణ అయిన ఆంధ్రప్రదేశ్ అయిన దేశంలో ఎక్కడైన ఏ పార్టీకి అయిన పునాదులు కార్యకర్తలు అయితే కొమ్మలు నాయకులు అనుకుందాం.. ఒక మొక్క బతకాలంటే దానికి వేర్లు బాగుండాలి.. అవి బాగుంటే చక్కని కాండం.. కొమ్మలు.. ఆకులు వస్తాయి.. మరి టీడీపీ కి అలాంటివి ఉన్నాయా అంటే ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ సంగతి పక్కన పెడితే కొన్ను చోట్ల అయితే మాత్రం నియోజకవర్గానికి ఐదారు వేల నుండి పది పదిహేను వేల వరకు కార్యకర్తలు అయితే ఉంటారు. ఇది ఎవరూ కాదనే సత్యం. ఇదే మాట ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని అన్నారంటేనే టీడీపీకి అక్కడక్కడ క్యాడర్ ఉన్నది అనే విషయం అర్ధమవుతుంది. అయితే ఈ ఐదారు పదిహేను వేల కార్యకర్తలతోనే టీడీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే కాదు రానున్న రోజుల్లో కూడా కష్టమే అని అనుకోవాలి..
ఎందుకంటే ఒక పార్టీకి క్యాడర్ ఎంత ముఖ్యమో ఆ క్యాడర్ ను నడిపించే నాయకత్వం కూడా అంతే ముఖ్యం.. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీతో జై తెలంగాణ అన్పించడమే కాదు అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ కు తెలంగాణకు అనుకూలం అని బాబు చేత లేఖ ఇప్పించింది ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్.. అంటే టీఆర్ఎస్ ఒప్పించే అంతవరకూ టీడీపీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న.. రాష్ట్ర విభజనకి అంత సుముఖుత లేదని అర్ధమవుతుంది. అయితే చంద్రబాబు ఒక మాటపై ఉండరు. ఎప్పుడు తన ప్రాంతమైన ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలే చూస్తారని అప్పటి అవిభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన పడేండ్ల రాజకీయ పరిస్థితులను చూస్తే అర్ధమవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. స్వతగా సమైక్యవాది అయిన చంద్రబాబు అప్పటి నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి అయన తెలంగాణకు అనుకూలం అని లేఖ ఇచ్చారు తప్ప తెలంగాణపై ప్రత్యేక ప్రేమ ఉండి కాదు అని తెలంగాణ వాదులు చెబుతుంటారు..
ఎందుకంటే తెలంగాణలోని ఏడు మండలాలతో పాటు ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న కరెంటు ఉత్పధిక కేంద్రాన్ని సైతం ఆంధ్రాలో కల్పితేనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని అప్పటి కేంద్ర ప్రభుత్వమైన బీజేపీని డిమాండ్ చేసి మరి తన పంతం నెగ్గించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఐదేండ్లు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా అడుగడుగున అడ్డుపడ్డారానే అపవాదు కూడా బాబు మూటగట్టుకున్నారు. అంతే కాకుండా విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో అరవై మూడు స్థానాలను గెలుపొందిన టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను కొనడానికి అప్పట్లో ప్రయత్నాలు చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి సీఎం అప్పటి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఎనుముల రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యేలను కొనబోయారు అని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపించిన విషయం ఇంకా మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంటది అని పాలిటిక్స్ లో గుసగుస.
ఇవే కాకుండా అడుగడున తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యవహరించిన చంద్రబాబు నేను మారిపోయాను . నాకు రెండు రాష్ట్రాలు రెండు కండ్లు అని ప్రజల ముందుకు వచ్చిన అక్కడక్కడ నాలుగైదు సీట్లు గెలుస్తారు తప్ప మళ్ళీ మునుపటి వైభవం మాత్రం టీడీపీకి రాకపోవచ్చు అని కూడా పొలిటికల్ టాక్. ఎందుకంటే ఒకవేళ టీడీపీకి అధికారం కట్టబెడితే ఏమవుతుందో.. తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా ఉండబోతాయో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పాలనలో అనుభవం ఉన్నది..అంతే కాకుండా ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నట్లు తెలంగాణలో ఎక్కువ ఆదాయం వచ్చే హైదరాబాద్ నుండి సంపదను అంత ఆంధ్రప్రాంతానికి తరలిస్తారానే వాదన కూడా ఉంది.. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాలు కోసం.. అట్లాంటిది మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆ తప్పు చేయరనే పొలిటికల్ క్రిటిక్స్ తెలంగాణ వాదులు బల్లగుద్ది చెప్పే మాట.. చూడాలి మరి మున్ముందు టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా..?.. తెలంగాణ వాదులు… పొలిటికల్ క్రిటిక్స్ చేసే విశ్లేషణలు నిజమావుతాయా…?.. రాజకీయంలో ఏదైనా సాధ్యమై అని అన్నట్లు బాబు నాయకత్వంలో టీడీపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అని…?