ఇంటికి పిలిచి.. మహిళను…?
మంథని- ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అయితే ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో దర్యాప్తులో హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి ఇంటి సమీపంలో ఉండే లావణ్య కొంతకాలం కిందట ఆమె వద్ద విడతల వారీగా రూ.1.50 లక్షల అప్పు తీసుకొంది.
కొంతకాలంగా తిరిగివ్వాలని రాజేశ్వరి ఒత్తిడి చేసింది. దీంతో ఈ నెల 8న డబ్బులు ఇస్తామని ఆమెను లావణ్య ఇంటికి పిలిచింది. అనంతరం భర్త రవి మరో వ్యక్తి కలిసి రాజేశ్వరి గొంతు నులిమి హత్య చేశారు.