పవన్ కళ్యాణ్ కి వైసీపీ సూటి ప్రశ్నలు
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లో దీపం-2 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడపిల్లలపై నీచంగా మాట్లాడితే తాటతీస్తామని వ్యాఖ్యానించారు..ఈ వ్యాఖ్యలకు వైసీపీ పలు ప్రశ్నలు వేసింది. ’35వేల మంది అమ్మాయిలు మిస్సైతే నిందితుల తాట ఎందుకు తీయలేదు?..అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది..
మీరు అధికారంలోకి వచ్చాక 77 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారు? మహిళను వేధించిన జానీ మాస్టర్ అరెస్టుపై ఎందుకు మాట్లాడలేదు? పిఠాపురంలో 16 ఏళ్ల బాలికను టీడీపీ నేత అత్యాచారం చేస్తే ఏం చేస్తున్నారు’ అంటూ వైసీపీ ప్రశ్నల వర్శం సంధించింది.