ప్రమాదానికి గురైన వైసీపీ ఎమ్మెల్యే కారు
ఏపీ అధికార వైసీపీకి చెందిన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కారు కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది.
ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్డులో వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కారు తన ముందున్న కారును ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.. అయితే ఎమ్మెల్యే సుబ్బారావు స్వల్పంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.