రోహిత్ కోసం యువ క్రికెటర్ త్యాగం..?

Rohit Sharma Team India captain
సహాజంగా క్రికెట్ లో అంతకుముందు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన క్రికెటర్‌కు తప్పకుండా అవకాశం దక్కుతుంది. కానీ, సీనియర్ కోసం తన ప్లేస్‌ను త్యాగం చేయాల్సిన పరిస్థితి దేశవాళీ క్రికెటర్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు మాత్రమే వచ్చింది. అదీనూ.. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసమైతే అదెంతో ప్రత్యేకంగా నిలవడం ఖాయం. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు..
అతడితోపాటు భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఆడాడు. వీరిద్దరూ ఓపెనింగ్ చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనప్పటికీ,రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కాస్త మెరుగైన ప్రదర్శనే చేశారు. ఈక్రమంలో రోహిత్ కోసం ఆయుష్ తన ఓపెనింగ్ ప్లేస్‌ను వదులుకొని బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా తన సంతోషం వ్యక్తంచేస్తూ ఆయుష్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు.
‘‘రోహిత్ ఆటను చూస్తూ పెరిగా,టీవీల్లో అతడి బ్యాటింగ్‌ను చూశా,ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా మార్గదర్శితో ఉండటం ప్రత్యేకమైన అనుభూతి. ఎన్నో విషయాలను నేర్చుకొని ముందుకుసాగుతా’’ అని ఆయుష్ వ్యాఖ్యలు జోడించాడు.. ఆయుష్ మాత్రే ఇప్పటివరకు కేవలం 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. అయితే, 441 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. 40 సగటుతో రాణించిన ఆయుష్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 176..
