జగన్ ఊర మాస్ వార్నింగ్..?
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఊర మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు.. అరెస్టులు చేస్తే భయపడేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అపరాత్రి.. ఆర్ధరాత్రి అని చూడకుండా మా పార్టీ సానుభూతి పరులను.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు.
డీజీపీ అధికారిగా కాకుండా అధికార పార్టీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. మళ్లీ మేము అధికారంలోకి వస్తాము. మా పార్టీ నేతలను.. కార్యకర్తలను సానుభూతి పరులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కర్ని వదిలిపెట్టను. సప్త సముద్రాల అవతల ఉన్న కానీ లాక్కోచ్చి మరి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.
కొంతమంది అధికారులు అనుకుంటున్నారు. మేము తెలంగాణ క్యాడర్ అధికారులం.. ఈ ప్రభుత్వం పోతే మేము మళ్లీ తెలంగాణకు వెళ్ళోచ్చు అని.. మీరు తెలంగాణకు వెళ్లిన.. విదేశాలకు వెళ్లిన.. రిటైర్మెంట్ ప్రకటించిన వదిలిపెట్టబోము.. తప్పకుండా అందరి లెక్కలు తేలుస్తాము అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.