వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

YS Sharmila
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది.
ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ మూడు పేజీల లేఖను ఈరోజు శుక్రవారం విడుదల చేశారు.జగన్ ఏదైనా నమ్మించగలడంటూ లేఖను ప్రారంభించిన ఆమె వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్న కాలం నుంచి నేటి వరకు జరిగిన ఆస్తుల విషయంలో జరిగిన అంశాలను ఆమె ప్రస్తావించారు.
రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని, వాటికి జగన్‌మోహన్ రెడ్డి సొంతం కాదని, ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమేనని స్పష్టం చేస్తూ ఓ బహిరంగ లేఖను రాశారు.
