మాజీ మంత్రి KTR పై పిర్యాదు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ జిల్లాలో హనుమకొండలో పిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి… టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ” ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర నుండి వసూలు చేసి ఢిల్లీకి పంపారు అని ” అసత్య ప్రచారం చేశారు.
ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని మాజీమంత్రి కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ పీఎస్ లో స్థానిక కాంగ్రెస్ నేతలు పిర్యాదు చేశారు. ఈ పిర్యాదును పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ చేసి హైదరాబాద్ లోని బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు.