తెలంగాణకు మరోసారి మొండి చేయి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు.
ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్ లతో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఎనిమిది స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టిన సంగతి కూడా తెల్సిందే. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న కానీ రాష్ట్రానికి బడ్జెట్ లో సున్నా కేటాయింపులు జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువడుతున్నాయి..